Pawan Kalyan: పవన్ కల్యాణ్ తో బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ... ఫొటోలు ఇవిగో!

Britain Dy High Commissioner met Pawan Kalyan
  • హైదరాబాదులోని పవన్ నివాసానికి వచ్చిన గారెత్ విన్ ఓవెన్
  • సాదరంగా స్వాగతం పలికిన పవన్
  • ఇరువురి మధ్య అనేక అంశాలపై చర్చ
తెలుగు రాష్ట్రాల బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ ఇవాళ జనసేనాని పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు. గారెత్ విన్ ఈవెన్ హైదరాబాదులోని పవన్ కల్యాణ్ నివాసానికి వచ్చేశారు. ఆయనకు పవన్ సాదరంగా స్వాగతం పలికారు. ఈ సమావేశంలో ఇరువురి మధ్య సామాజిక, వర్తమాన అంశాలు, ఆర్థిక, రాజకీయ, విద్య, ఉపాధి తదితర విషయాలు చర్చకు వచ్చాయి. ఈ సమావేశంలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, బ్రిటీష్ డిప్యూటీ హై కమిషన్ రాజకీయ ఆర్థిక సలహాదారు నళిని రఘురామన్ కూడా పాల్గొన్నారు.
Pawan Kalyan
British Dy High Commissioner
Gareth Wynn Owen
Hyderabad
Janasena

More Telugu News