Rahul: రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటిండెంట్ రాహుల్ భార్య మృతి

Rajahmundry Central Jail Superintindent Rahul wife dies of illness
  • అనారోగ్యంతో బాధపడుతున్న కిరణ్మయి
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు కన్నుమూత
  • నిన్న మధ్యాహ్నం నుంచి సెలవులో ఉన్న రాహుల్

రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటిండెంట్ రాహుల్ భార్య కిరణ్మయి మృతి చెందారు. కిరణ్మయి వయసు 46 సంవత్సరాలు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె గత కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో నేడు తుదిశ్వాస విడిచారు. భార్య అనారోగ్యం కారణంగా రాహుల్ సెలవులో ఉన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న నేపథ్యంలో, రాహుల్ సెలవుపై వెళ్లడం చర్చనీయాంశం అయింది. నిన్న మధ్యాహ్నం నుంచి ఆయన సెలవులో ఉన్నారు. భార్య అనారోగ్యం కారణంగానే ఆయన సెలవుపై వెళ్లారని జైళ్ల శాఖ, ఏపీ హోంమంత్రి తానేటి వనిత ఇప్పటికే స్పందించారు.

  • Loading...

More Telugu News