Nandamuri Ramakrishna: గన్నవరంలో నిరాహార దీక్షలో పాల్గొన్న నందమూరి రామకృష్ణ

Nandamuri Ramakrishna participated Hunger strike in Gannavaram
  • చంద్రబాబు అరెస్ట్ ను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు
  • గన్నవరంలో నిరాహారదీక్ష శిబిరానికి వెళ్లిన రామకృష్ణ
  • దీక్షలో పాల్గొన్న జనసేన నేతలు, కార్యకర్తలు
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ ను నిరసిస్తూ ఆ పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు, నిరాహార దీక్షలు చేపట్టాయి. గన్నవరంలో జరుగుతున్న నిరాహారదీక్ష శిబిరానికి నందమూరి రామకృష్ణ చేరుకున్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ... దీక్షలో కూర్చున్న వారికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరాహార దీక్షలు చేస్తున్న ప్రతి ఒక్కరికీ మద్దతు తెలపుతున్నానని చెప్పారు. చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిని చేసేందుకు అందరం కలిసి పోరాడుదామని పిలుపునిచ్చారు. వైసీపీ నాయకులను తరిమి కొడదామని చెప్పారు. మరోవైపు ఈ కార్యక్రమంలో జనసేన నేతలు, కార్యకర్తలు కూడా పాల్గొన్నారు.
Nandamuri Ramakrishna
Telugudesam
Gannavaram
Hunger Strike

More Telugu News