Farooq Abdullah: మహిళా రిపోర్టర్ తో ఫరూక్ అబ్దుల్లా కొంటె ప్రశ్నలు.. తప్పుబట్టిన బీజేపీ

Video of Farooq Abdullah asking reporter marriage question viral BJP responds
  • పెళ్లి ఎప్పుడు చేసుకుంటావ్? నీవే చూసుకుంటావా? అంటూ అబ్దుల్లా ప్రశ్న
  • చేతిపై మెహందీ ఎందుకు ఉందంటూ మరో ప్రశ్న
  • వీలైనప్పుడల్లా ఆమె చేతులను తడిమిన ఎన్సీ నేత
  • మనవరాలి వయసు యువతితో ఆ ప్రశ్నలు ఏంటి? అని ప్రశ్నించిన అమిత్ మాలవీయ
నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత, జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా 85 ఏళ్ల వయసులోనూ ఓ మహిళా రిపోర్టర్ ను చిలిపి ప్రశ్నలతో ఇబ్బంది పెట్టారు. ఈ వైఖరిని బీజేపీ నేత అమిత్ మాలవీయ తప్పుబట్టారు. తన ఎదుట పడిన మహిళా జర్నలిస్ట్ తో.. పెళ్లి ఎప్పుడు చేసుకుంటావ్? అని ఫరూక్ అబ్దుల్లా ప్రశ్నించారు. అంతటితో ఆగి పోలేదు. ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించి మరిన్ని ప్రశ్నలు సంధించి ఇబ్బందికి గురిచేశారు. అంతేకాదు మధ్య మధ్యలో ఆమె చేతిని తడుముతూ మాట్లాడారు. దీనిపై బీజేపీ నేత అమిత్ మాలవీయ స్పందిస్తూ ట్విట్టర్ లో ఓ ట్వీట్ పోస్ట్ చేశారు. 

రిపోర్టర్ వయసు ఆయన మనవరాలితో సమానం. లేదా అంతకంటే తక్కువే. అయినా.. ఎప్పుడు నీవు పెళ్లి చేసుకుంటావు? నీవు భర్తను ఎంపిక చేసుకున్నావా? మీ తల్లిదండ్రులు చూస్తారా? లేక నీవు చూసుకుంటావా? నీ చేతులపై ఈ మెహెందీ ఎందుకు ఉంది? వంటి అసౌకర్యకరమైన ప్రశ్నలు వేయకుండా ఆయన్ను నిలువరించలేకపోయింది. ఆమె తన సోదరుడి వివాహం అని చెప్పగా.. అతని భార్య అతడితోనే ఉంటుందా? లేక వదిలేసి వెళుతుందా? అని అబ్దుల్లా అడిగారు. నీవు పెళ్లి చేసుకున్నట్టయితే? అని అబ్దుల్లా మళ్లీ ప్రశ్నించారు. దీనికి ఆమె ‘సర్ నేను చాలా చిన్న దాన్ని ఇప్పుడు’ అని బదులిచ్చింది. దానికి మళ్లీ అబ్దులా స్పందిస్తూ ఎవరిని పెళ్లి చేసుకుంటావో జాగ్రత్త పడు. ఎవరికి తెలుసు అతడు మహిళలతో ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో.. నీకు తెలియకపోవచ్చు అంటూ అబ్దుల్లా వేసిన ప్రశ్నలను మాలవీయ తన ట్విట్టర్ పోస్ట్ లో ఉదహరించారు.
Farooq Abdullah
woman reporter
marriage question
viral vedio
BJp amith malaviya

More Telugu News