Peddapalli District: విష జ్వరంతో 16 ఏళ్ల బాలిక మృతి

Inter Girl Died With Viral Fever In Paddapalli District
  • పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో ఘటన
  • హనుమకొండ జిల్లా మడికొండలోని గురుకులంలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న బాలిక
  • వారం రోజులుగా వస్తూ పోతున్న జ్వరం
  • జమ్మికుంట ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే మృతి

ఇంటర్ చదువుతున్న 16 ఏళ్ల బాలిక విష జ్వరంతో మృతి చెందడం పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలంలో విషాదం నింపింది. ఆరేపల్లి గ్రామ పరిధిలోని మల్లయ్యపల్లెకు చెందిన కోడి శ్యాం-రజిత దంపతుల పెద్ద కుమార్తె అశ్విత హనుమకొండ జిల్లా మడికొండలోని గురుకుల పాఠశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది.

అశ్వితకు వారం రోజులుగా జ్వరం వస్తూ పోతుండడంతో కుటుంబ సభ్యులు శనివారం పాఠశాలకు వచ్చి ఇంటికి తీసుకెళ్లారు. కుమార్తెకు మళ్లీ తీవ్ర జ్వరం రావడంతో నిన్న జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందింది. విషజ్వరంతో బాలిక మృతి చెందడం గ్రామంలో విషాదం నింపింది.

  • Loading...

More Telugu News