aeroplane: రన్‌వేపై జారి రెండు ముక్కలైన విశాఖ-ముంబయి ప్రైవేటు విమానం!

Private Jet veers off runway while landing at Mumbai airport
  • విశాఖ నుంచి బయలుదేరిన వీర్స్ ప్రైవేటు జెట్
  • ముంబయిలో ల్యాండింగ్ సమయంలో రన్‌వేపై జారి పక్కకు దూసుకెళ్లిన విమానం
  • ప్రతికూల వాతావరణం కారణంగా ప్రమాదం!
  • విమానంలోని ఎనిమిది మందికి స్వల్ప గాయాలు
ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం ఆరుగురు ప్రయాణికులు, ఇద్దరు సిబ్బందితో కూడిన ప్రైవేటు జెట్ విమానం రన్‌వే పై జారి పక్కకు దూసుకెళ్లింది. ప్రతికూల వాతావరణం కారణంగా ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. వీఎస్ఆర్ వెంచర్స్ లీర్ జెట్ 45 ఎయిర్ క్రాఫ్ట్ వీటీ-డీబీఎల్ విమానం విశాఖపట్నం నుంచి ముంబయికి బయలుదేరింది. ముంబయిలో ల్యాండ్ అవుతుండగా ప్రమాదవశాత్తు రన్‌వేపై జారి, పక్కకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో విమానం రెండు ముక్కలైంది. విమానంలో ఉన్న ఎనిమిది మందికి స్వల్పగాయలు కాగా, వారిని ఆసుపత్రికి తరలించారు.

ముంబయిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో 700 మీటర్లకు మించి విజిబులిటీ లేదని డీజీసీఏ తెలిపింది. రన్‌వే 27పై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విమాన ప్రమాదం నేపథ్యంలో ఈ రన్‌వేను కొద్దిసేపు మూసివేశారు. ఆ సమయంలో దిగవలసిన ఐదు విమానాలను మరోచోట దింపారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి.
aeroplane
mumbai
Visakhapatnam

More Telugu News