world record: ఒంటి నిండా కుమార్తె పేరుతో పచ్చబొట్లు.. ప్రపంచ రికార్డ్

UK dad reclaims world record with 667 tattoos of daughters name
  • బ్రిటన్ వాసి ఎవాన్స్ సరికొత్త రికార్డు
  • గతంలో 267 సార్లు శరీరంపై కుమార్తె పేరు
  • ఇప్పుడు మరో విడత 400 సార్లు రాయించుకోవడంతో కొత్త రికార్డ్
బ్రిటన్ కు చెందిన మార్క్ ఓవెన్ ఎవాన్స్ (49) ఒక్క పనితో కూతురిపై ప్రేమను చాటడంతోపాటు, ప్రపంచ రికార్డును కొల్లగొట్టాడు. గతంలో తాను సృష్టించిన ప్రపంచ రికార్డును తిరగరాశాడు. తన ఏడేళ్ల కుమార్తె లూసీ పేరును తన  శరీరంపై గతంలో 267 సార్లు పచ్చబొట్టు రూపంలో వేయించుకుని ప్రపంచ రికార్డును నమోదు చేయడం గమనార్హం. ఇప్పుడు మరోసారి లూసీ పేరును మరో 400 సార్లు పచ్చబొట్టుగా పొడిపించుకున్నాడు. దీంతో శరీరంపై ఒకే పేరును అధిక సంఖ్యలో (667సార్లు) కలిగి ఉన్న వ్యక్తిగా ప్రపంచ రికార్డు సాధ్యపడింది.

ఎవాన్స్ మొదట 2017లో తన కుమార్తె పేరును తన శరీరంపై 200 సార్లు టాటూగా వేయించుకున్నాడు. అది ప్రపంచ రికార్డుగా నమోదైంది. కానీ, అమెరికాకు చెందిన డెడ్రా విజిల్ ఈ రికార్డును చెరిపేశాడు. తన పేరును 300 సార్లు పచ్చబొట్టుగా వేయించుకుని గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కాడు. ఎవాన్స్ తన వీపు వెనుక భాగంలో గతంలో కుమార్తె పేరును రాయించుకోవడంతో.. ఈ విడత రెండు కాళ్ల తొడలపై 200 సార్లు చొప్పున టాటూ వేయించుకున్నాడు. నిజానికి 2017లో లూసీ జన్మించినప్పుడు ఆమె సంరక్షణ కోసం డబ్బులు సమీకరించేందుకు గాను ఎవాన్స్ పచ్చబొట్టు రికార్డు ఆలోచన చేయడం గమనార్హం. 100 సార్లు రాయాలని చెప్పగా.. ఆర్టిస్ట్ మాత్రం 267 సార్లు లూసీ పేరును ఎవాన్స్ శరీరంపై చెక్కేశాడు. ‘‘నా రికార్డు నాతోపాటే ఎక్కడికి వెళ్లినా వస్తుందంటూ’’ ఎవాన్స్ ప్రకటించడం గమనార్హం. 
world record
UK dad
667 tattoos
daughters name

More Telugu News