Tollywood: 'ఆపరేషన్ వాలెంటైన్‌'కు డబ్బింగ్ మొదలు పెట్టిన వరుణ్​ తేజ్

Varun Tej Operation Valentine Team commences dubbing works
  • శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా
  • హీరోయిన్‌గా మానుషి చిల్లార్
  • డిసెంబర్ 8న హిందీ, తెలుగు భాషల్లో విడుదల
మెగా హీరో వరుణ్ తేజ్ వరుస సినిమాలో బిజీగా ఉన్నాడు. ఎఫ్3, గని, గాండీవధారి అర్జున చిత్రాలు నిరాశ పరచడంతో ప్రస్తుతం ‘ఆపరేషన్ వాలెంటైన్’పై భారీ అశలు పెట్టుకున్నాడు. యాడ్ ఫిల్మ్ మేకర్ శక్తి ప్రతాప్ సింగ్ హడా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్‌గా వరుణ్ తేజ్ నటిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. 
తాజాగా ఈ చిత్రానికి సంబంధించి డబ్బింగ్ కార్యక్రమాలు నిన్న మొదలయ్యాయి. మరోవైపు వీఎఫ్‌ఎక్స్ పనులు కూడా జరుగుతున్నాయి. ఈ చిత్రంలో వరుణ్ సరసన హీరోయిన్‌గా మానుషి చిల్లర్ నటించింది. ఆమె రాడార్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్, రినైసెన్స్ పిక్చర్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. డిసెంబర్ 8న తెలుగు, హిందీ భాషల్లో సినిమా విడుదల కానుంది. వచ్చే నెల ట్రైలర్ విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోంది.
Tollywood
Operation Valentine
movie
Varun Tej
dubbing works
hindi

More Telugu News