Ambati Rambabu: చంద్రబాబు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా ట్వీట్‌పై స్పందించిన అంబటి రాంబాబు

Ambati Rambabu counter to Chandrababu laywer tweet
  • న్యాయం కనుచూపుమేర లేకుంటే కత్తిపట్టడమేనని చంద్రబాబు తరఫు న్యాయవాది ట్వీట్
  • ఎక్స్ వేదికగానే స్పందించిన మంత్రి అంబటి రాంబాబు
  • న్యాయవాది మాటలతో ఈ కేసు బలం అర్థమైందని వ్యాఖ్య

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టై రాజమహేంద్రవరం కేంద్రకారాగారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తరఫున వాదిస్తోన్న సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా చేసిన ట్వీట్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మంత్రి అంబటి రాంబాబు పరోక్షంగా స్పందించారు.  ఈ మేరకు ఆయన పేరు పేర్కొనకుండా సోషల్ మీడియా వేదిక ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ పెట్టారు.

న్యాయపోరాటం కంటే ఆయుధ పోరాటమే మిన్న అన్న న్యాయవాది మాటలతో ఈ కేసు బలం అర్థమైందంటూ విమర్శలు గుప్పించారు. అంతకుముందు జైల్లో చంద్రబాబుతో ములాఖత్‌కు ముందు సిద్ధార్థ లూథ్రా చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. అన్ని ప్రయత్నాలు చేసినా న్యాయం కనుచూపుమేర లేకుంటే ఇక కత్తిపట్టడమే, పోరాటానికి ఇదే సరైన విధానమంటూ గురుగోవింద్ సింగ్ సూక్తిని ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News