Raghavendra Rao: మళ్లీ ఆ వెంకటేశ్వరస్వామే చంద్రబాబును కాపాడతాడు: దర్శకుడు రాఘవేంద్రరావు

Raghavendra Rao says Lord Venkateswara will save Chandrababu again
  • స్కిల్ డెవలప్ మెంట్  కేసులో చంద్రబాబు అరెస్ట్
  • రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత
  • తిరుమల వెంకన్నపై భారం వేసిన రాఘవేంద్రరావు
  • గతంలో చంద్రబాబును అలిపిరి బాంబ్ బ్లాస్ట్ నుంచి కాపాడాడని వెల్లడి
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో రిమాండ్ ఎదుర్కొంటున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును జైలు నుంచి బయటికి తీసుకువచ్చేందుకు ఆయన న్యాయవాదులు తీవ్రంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఆసక్తికరంగా స్పందించారు. 

గతంలో చంద్రబాబు శ్రీ వెంకటేశ్వరస్వామి కృపా కటాక్షాలతో అలిపిరి బాంబ్ బ్లాస్ట్ నుంచి క్షేమంగా బయటపడ్డారని వెల్లడించారు. ఇప్పుడు కూడా ఆ స్వామి వారే చంద్రబాబును కాపాడతారని రాఘవేంద్రరావు స్పష్టం చేశారు. వెంకటేశ్వరస్వామి వారి ఆశీస్సులతో చంద్రబాబు ఎలాంటి అవినీతి మచ్చ లేకుండా జైలు నుంచి తప్పకుండా బయటపడతారని పేర్కొన్నారు. స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత సినీ రంగం నుంచి స్పందించిన మొదటి వ్యక్తి రాఘవేంద్రరావే.
Raghavendra Rao
Chandrababu
Lord Venkateswara
Skill Develoment Case

More Telugu News