Ayyanna Patrudu: చంద్రబాబు అరెస్ట్‌పై ఢిల్లీ పెద్దలు ఎందుకు స్పందించడం లేదు?: అయ్యన్నపాత్రుడు

Ayyanna Patrudu questions Delhi leaders about Chandrababu arrest
  • ఏపీలో జరుగుతున్న పరిణామాలు ఢిల్లీలోని పెద్దలకు కనిపించడం లేదా? అని నిలదీత
  • ఇంత జరుగుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలని ప్రశ్న
  • కేంద్రం ఇచ్చే నిధులను కూడా జగన్ పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపణ
తమ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడి అరెస్ట్‌పై కేంద్ర పెద్దలు ఎందుకు స్పందించడం లేదని టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఢిల్లీలోని పెద్దలకు కనిపించడం లేదా? అని నిలదీశారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో కేంద్ర పెద్దలకు తెలియదా? ఓ రాష్ట్రంలో ఏం జరుగుతుందో చూడరా? అన్నారు. జీ20 సదస్సు వల్ల ఏం ఉపయోగమన్నారు. ఏపీలో వ్యవస్థలన్నీ దిగజారిపోయాయన్నారు.

ఇంత జరుగుతున్నా కేంద్ర పెద్దలు ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలన్నారు. ఏపీకి కేంద్రం ఇచ్చే నిధులను జగన్ పక్కదారి పట్టిస్తున్నారని, అయినప్పటికీ ఢిల్లీ పెద్దలు మాట్లాడటం లేదన్నారు. నిధులు పక్కదోవ పట్టడం వారికి కనిపించడం లేదా? అన్నారు. తన నలభై ఏళ్ళ రాజకీయ జీవితంలో ఇలాంటి దారుణ పరిస్థితిని ఎప్పుడూ చూడలేదన్నారు.
Ayyanna Patrudu
Chandrababu
Telugudesam
BJP

More Telugu News