Vietnam: వియత్నాంలో ఓ అపార్ట్‌మెంట్‌లో చెలరేగిన మంటలు.. 50 మంది సజీవ దహనం

50 killed after fire breaks out in apartment building in Vietnam
  • హనోయిలోని 9 అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం
  • అపార్ట్‌మెంట్‌లో 45 కుటుంబాలు
  • భవనం ఇరుకు సందులో ఉండడంతో సహాయక చర్యలకు ఆటంకం

వియత్నాంలోని హనోయిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. 9 అంతస్తుల అపార్ట్‌మెంట్‌లో గత రాత్రి చెలరేగిన మంటలు 50 మంది ప్రాణాలు బలిగొన్నాయి. పదుల సంఖ్యలో గాయపడ్డారు. అయితే, మృతుల సంఖ్యలో మరింత స్పష్టత రావాల్సి ఉందని అధికారులు తెలిపారు. అయితే, అగ్నిప్రమాదం తర్వాత ఆసుపత్రికి తరలించిన 54 మంది మరణించినట్టు స్థానిక వార్తా పత్రికలు పేర్కొన్నాయి. 

ప్రమాదం సంభవించిన భవనంలో 45 కుటుంబాలు నివాసముంటున్నాయి. రాత్రి 11.30 గంటల సమయంలో అగ్నిప్రమాదం సంభవించినప్పుడు అందరూ ఇళ్లలోనే ఉన్నారని అధికారులు తెలిపారు. భవనం ఇరుకు సందులో ఉండడంతో సహాయక కార్యక్రమాలకు ఆటంకం కలిగినట్టు వియత్నాం అధికారిక న్యూస్ ఏజెన్సీ తెలిపింది. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News