Kesineni Nani: చంద్రబాబు కోసం... రిషికేశ్ వద్ద గంగా తీరంలో యాగం జరిపించిన కేశినేని నాని... ఫొటోలు ఇవిగో!

TDP MP Kesineni Nani performs sacred yagna at Ganga river banks in Rishikesh
  • స్కిల్ స్కాంలో చంద్రబాబు అరెస్ట్
  • కుటుంబ సమేతంగా యాగంలో పాల్గొన్న కేశినేని నాని
  • సోషల్ మీడియాలో ఫొటోలను  పంచుకున్న టీడీపీ ఎంపీ
టీడీపీ అధినేత చంద్రబాబుతో కేశినేని నానికి విభేదాలున్నాయని ఇటీవలి వరకు ప్రచారం జరిగింది. అయితే, చంద్రబాబుపై తనకెంత అభిమానం ఉందో కేశినేని నాని ఓ యజ్ఞంతో నిరూపించుకున్నారు. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో కేశినేని నాని ప్రముఖ పుణ్యక్షేత్రం రిషికేశ్ వెళ్లి పవిత్ర గంగా నదీ తీరంలో యాగం జరిపించారు. 

దీనికి సంబంధించిన ఫొటోలను కేశినేని నాని సోషల్ మీడియాలో  పంచుకున్నారు. చంద్రబాబు ఆరోగ్యంగా, క్షేమంగా ఉండాలంటూ హృదయపూర్వకంగా ప్రార్థించానని కేశినేని నాని వెల్లడించారు. ఈ యాగంలో కేశినేని నాని కుటుంబ సభ్యులతో సహా పాల్గొన్నారు.
Kesineni Nani
Chandrababu
Rishikesh
Ganga River
TDP

More Telugu News