Chandrababu: చంద్రబాబు కుటుంబ సభ్యులకు ముగ్గురికి అనుమతి

Three family members allowed to meet Chandrabau in Jail
  • ములాఖత్ లో చంద్రబాబును కలవనున్న కుటుంబ సభ్యులు
  • 45 నిమిషాల పాటు మాట్లాడేందుకు అధికారుల అనుమతి
  • జైలు వద్దకు చేరుకున్న కుటుంబ సభ్యులు
రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును ఆయన కుటుంబ సభ్యులు కలవనున్నారు. అయితే ఈరోజు ముగ్గురు కుటుంబ సభ్యులను మాత్రమే అధికారులు అనుమతించారు. దీంతో బాబును భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణి కలవనున్నారు. ముగ్గురికి మాత్రమే అనుమతి రావడంతో... బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని, ఆమె భర్త భరత్ బయటే ఉండిపోయారు. ములాఖత్ లో చంద్రబాబును 45 నిమిషాల పాటు కలిసేందుకు అనుమతించారు. ఇప్పటికే సెంట్రల్ జైలుకు కుటుంబ సభ్యులు చేరుకున్నారు. మరోవైపు సెంట్రల్ జైలు వద్ద భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.
Chandrababu
Telugudesam
Mulakhat
Family
Nara Lokesh
Nara Bhuvaneswari
nara brahmani

More Telugu News