Chandrababu: రాజమండ్రి చేరుకున్న నారా భువనేశ్వరి, బ్రాహ్మణి, తేజస్విని, భరత్.. ఫొటోలు ఇవిగో!

Chandrababu family members arrives Rajahmundry
  • స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్ట్
  • రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు
  • ఈ సాయంత్రం చంద్రబాబును కలవనున్న కుటుంబ సభ్యులు
  • ములాఖాత్ కు అనుమతినిచ్చిన జైలు అధికారులు

టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు స్కిల్ డెవలప్ మెంట్  స్కాం కేసులో అరెస్టయిన సంగతి తెలిసిందే. విజయవాడ ఏసీబీ కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ప్రస్తుతం ఆయన రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. చంద్రబాబును కలుసుకునేందుకు ఆయన కుటుంబ సభ్యులు రాజమండ్రి వచ్చారు. నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి, బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని, ఆమె భర్త భరత్ ఈ మధ్యాహ్నం రాజమండ్రి చేరుకున్నారు. వారు ఈ సాయంత్రం 4 గంటలకు రాజమండ్రి జైలులో చంద్రబాబును కలవనున్నారు. ఈ మేరకు జైలు అధికారులు ములాఖాత్ కు అనుమతి ఇచ్చారు.

  • Loading...

More Telugu News