Sachin Tendulkar: తన రికార్డును కోహ్లీ బ్రేక్ చేయడంపై సచిన్ టెండూల్కర్ స్పందన

Sachin Tendulkar reacts after Virat Kohli breaks his world record earmarks big positive for India after win vs PAK
  • గొప్పగా ఆడారంటూ అభినందనలు తెలిపిన సచిన్
  • టాప్-6 రాణించడం సానుకూల సంకేతమని అభివర్ణన
  • సచిన్ కంటే వేగంగా 13,000 పరుగులు చేసిన కోహ్లీ
పాకిస్థాన్ పై విరాట్ కోహ్లీ గొప్ప పోరాట ప్రదర్శన చేసిన నేపథ్యంలో లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ స్పందించారు. కోహ్లీతో పాటు కేఎల్ రాహుల్ ను సైతం టెండూల్కర్ అభినందించారు. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో సోమవారం పాకిస్థాన్ తో జరిగిన గ్రూప్-4 మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 94 బంతులకే 122 పరుగులు సాధించగా, కేఎల్ రాహుల్ 106 బంతుల్లో 111 పరుగులు సాధించాడు. దీంతో వీరి ప్రదర్శనపై సచిన్ ట్విట్టర్ లో స్పందించారు. 

‘‘విరాట్, కేఎల్ రాహుల్ 100 పరుగుల చొప్పున సాధించినందుకు అభినందనలు. టీమిండియాకు ఒక పెద్ద సానుకూల సంకేతం ఏమిటంటే.. టాప్-6 బ్యాటర్లు రోహిత్, శుభమన్, విరాట్ కోహ్లీ, కేఎల్, ఇషాన్, హార్దిక్ రెండు మ్యాచుల్లో వివిధ దశల్లో స్కోర్లు సాధించారు. గొప్పగా ఆడారు. దీన్ని కొనసాగించండి’’ అని సచిన్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ మ్యాచ్ లోనే సచిన్ రికార్డును కోహ్లీ అధిగమించాడు. కానీ, దీని గురించి సచిన్ ప్రస్తావించలేదు. 

వన్డే అంతర్జాతీయ మ్యాచుల్లో విరాట్ కోహ్లీ 13,000 పరుగుల మైలురాయిని అధిగమించాడు. సచిన్ పేరిట ఉన్న 13 వేల పరుగుల మైలురాయిని తిరగరాశాడు. కాకపోతే సచిన్ కంటే కోహ్లీ వేగంగా 13,000 పరుగులకు చేరాడు. సచిన్ కు ఈ మైలురాయిని చేరుకోవడానికి 321 ఇన్నింగ్స్ లు పట్టగా, కోహ్లీ కేవలం 267 ఇన్నింగ్స్ లలోనే దీన్ని పూర్తి చేశాడు.
Sachin Tendulkar
reaction
Team India
kohli
kl rahul

More Telugu News