Miss Shetty Mr Polishetty: తేలిపోతున్న మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి

Miss Shetty Mr Polishetty box office collection Day 5 collections drop
  • ఐదు రోజుల్లో ఆదాయం రూ.13.48 కోట్లు
  • సోమవారం అత్యంత కనిష్టానికి తగ్గిన వసూళ్లు
  • రానున్న రోజుల్లో మరింత ఆదరణ కష్టమే
మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి.. అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి జంటగా నటించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది. సినిమాకు మంచి ఆదరణ వస్తుందని ముందు నుంచి అంచనాలు నెలకొనగా, వాస్తవ ఫలితం వేరే మాదిరిగా ఉంది. ఈ సోమవారం (11వ తేదీన) ఈ సినిమా కలెక్షన్లు అత్యంత కనిష్టానికి చేరాయి. సినిమా విడుదలైన తర్వాత ఒక రోజులో తక్కువ కలెక్షన్లు ఇవే. సోమవారం రూ.1.75 కోట్లు వసూలైంది. దీంతో సినిమా వచ్చిన తర్వాత ఐదు రోజుల్లో 13.48 కోట్ల మేర వసూలైనట్లు తెలుస్తోంది. 

తొలుత వసూళ్లు డల్ గానే మొదలైనప్పటికీ, వారాంతంలో డిమాండ్ కనిపించింది. తిరిగి సోమవారం ఆదాయం పడిపోయింది. పి. మహేశ్ బాబు దర్శకత్వంలో వచ్చిన రొమాంటిక్ కామెడీ సినిమాయే మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి. నేటి కాలంలో రిలేషన్స్, వీర్యదానం గురించి ఈ సినిమా చర్చిస్తుంది. ఈ చిత్రంలో మురళీ శర్మ, జయసుధ, తులసి, అభినవ్ గోమతమ్, సోనియా దీప్తి తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. 

Miss Shetty Mr Polishetty
box office
collection Day

More Telugu News