MS Dhoni: అమెరికాలో అభిమానిని ఆటపట్టించిన ధోనీ

Give the chocolates back MS Dhoni banter with fan in US is viral vedio
  • ఆటోగ్రాఫ్ తీసుకున్న అభిమాని
  • ధోనీ కోసం చాక్లెట్ బాక్స్ తెచ్చి ఇవ్వకుండా తిరుగుముఖం
  • పిలిచి మరీ చాక్లెట్ తీసుకున్న ధోనీ
మహేంద్ర సింగ్ ధోనీ.. భారత క్రికెట్ లో సక్సెస్ ఫుల్ కెప్టెన్. ఎక్కువ మంది అభిమానించే క్రికెటర్లలో ఒకడు. ఎప్పుడైనా సెల్ఫీల కోసం అభిమానులు ముందుకు వస్తే కాదనకుండా ఇస్తాడు. వారిని స్నేహంగా పలకరిస్తుంటాడు. టీమిండియా నుంచి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత కూడా ధోనీని భారీగా అభిమానులు ఆరాధిస్తున్నారంటే అతడి స్థానమే ప్రత్యేకమని చెప్పుకోవాలి. 

ప్రస్తుతం ఎంఎస్ ధోనీ అమెరికా పర్యటనలో ఉన్నాడు. ఇటీవలే ముగిసిన యూఎస్ ఓపెన్ 2023 క్వార్టర్ ఫైనల్ పోటీలను సైతం వీక్షించాడు. అమెరికాలో ఓ అభిమాని ధోనీని కలుసుకున్న సందర్భంగా చోటు చేసుకున్న సరదా సంభాషణను క్రిక్ వాచర్ పేరుతో ఉన్న ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేశారు.

ఓ చిన్న క్రికెట్ బ్యాట్ పై ఒక అభిమాని ధోనీ ఆటోగ్రాఫ్ తీసుకున్నాడు. ఆటోగ్రాఫ్ తర్వాత ధోనీకి కానుక ఇవ్వాలనే ఉద్దేశ్యంతో చాక్లెట్ బాక్స్ తీసుకొచ్చాడు. కుడి చేత్తో బ్యాట్ పట్టుకున్న సదరు వ్యక్తి, ఎడమ చేత్తో చాక్లెట్ బాక్స్ పట్టుకుని ఉన్నాడు. ఆటోగ్రాఫ్ అనంతరం చాక్లెట్ బాక్స్ ఇవ్వకుండా వెళ్లిపోతుంటే.. ధోనీ పిలిచి చాక్లెట్ బాక్స్ ఇవ్వవా? అని ప్రశ్నించాడు. దానికి అభిమాని నవ్వుతూ చాక్లెట్ బాక్స్ ను ధోనీకి ఇచ్చి వెళ్లిపోయాడు.
MS Dhoni
chocolates box
chocolates
viral vedio
autograph

More Telugu News