Nara Lokesh: రాజమండ్రి సెంట్రల్ జైలుకు కిలోమీటర్ దూరంలో టీడీపీ క్యాంప్

TDP camp near Rajahmundry Central Jail
  • టీడీపీ క్యాంప్ లో ఉన్న నారా లోకేశ్
  • అక్కడి నుంచే టీడీపీ నేతలతో చర్చలు జరుపుతున్న లోకేశ్
  • చంద్రబాబుతో ములాఖత్ కు దరఖాస్తు చేసుకున్న కుటుంబ సభ్యులు
టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రెండో రోజు గడుపుతున్నారు. కాసేపట్లో వైద్యులు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయన హౌస్ రిమాండ్ కు సంబంధించి ఈ మధ్యాహ్నం తీర్పు వెలువడనుంది. మరోవైపు రాజమండ్రి సెంట్రల్ జైలుకు కిలోమీటర్ దూరంలో టీడీపీ క్యాంప్ ను ఏర్పాటు చేసింది. ఈ క్యాంప్ లో నారా లోకేశ్ ఉన్నారు. ఇక్కడి నుంచే ఆయన టీడీపీ నేతలతో చర్చలు జరపుతున్నారు. ఇంకోవైపు చంద్రబాబును ములాఖత్ ద్వారా ఈరోజు ఆయన కుటుంబ సభ్యులు కలుసుకునే అవకాశం ఉంది. ములాఖత్ కు వారు దరఖాస్తు చేసుకున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు వారు కలుసుకునే అవకాశం ఉంది.
Nara Lokesh
Telugudesam
Chandrababu

More Telugu News