Chikoti Praveen: నేడు బీజేపీలో చేరనున్న చికోటి ప్రవీణ్

Chikoti Praveen joining BJP today
  • కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరనున్న చికోటి ప్రవీణ్
  • భారీ ర్యాలీతో బీజేపీ ఆఫీస్ కు చేరుకోనున్న ప్రవీణ్
  • కేసీఆర్ అక్రమాలను బీజేపీ మాత్రమే అడ్డుకోగలదని వ్యాఖ్య
కేసినో కింగ్ చికోటి ప్రవీణ్ రాజకీయ రంగంలోకి అడుగుపెడుతున్నారు. ఈరోజు ఆయన బీజేపీలో చేరబోతున్నారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఈ ఉదయం 11 గంటలకు హైదరాబాద్ కర్మాన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ నుంచి ఆయన భారీ ర్యాలీగా ఎల్బీనగర్, దిల్ సుఖ్ నగర్, నల్గొండ క్రాస్ రోడ్స్, మలక్ పేట, కోఠి, అబిడ్స్, నాంపల్లి మీదుగా బీజేపీ కార్యాలయానికి చేరుకోనున్నారు. 

ఈ సందర్భంగా చికోటి ప్రవీణ్ మీడియాతో మాట్లాడుతూ... ప్రధాని మోదీ స్ఫూర్తితోనే బీజేపీలో చేరుతున్నానని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అక్రమాలను బీజేపీ మాత్రమే అడ్డుకోగలదని, అందుకే బీజేపీలో చేరుతున్నానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పారు. మరోవైపు, కేసినో కేసుల్లో ప్రవీణ్ ను ఈడీ కూడా విచారించిన సంగతి తెలిసిందే.
Chikoti Praveen
Casino
BJP

More Telugu News