kiren rijiju: ఇక సముద్రయాన్... మత్స్య 6000 జలాంతర్గామి ఫొటోలు విడుదల చేసిన కిరణ్ రిజిజు

Union Minister Shares Pics Of Matsya 6000 Indias Deep Sea Submersible
  • చెన్నైలోని ఎన్ఐవోటీ అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపిన కేంద్రమంత్రి
  • సముద్ర గర్భ అన్వేషణలో తోడ్పడే మొట్టమొదటి మానవసహిత జలాంతర్గామి అని వెల్లడి
  • ఆక్సానాట్‌లను సముద్రంలో 6,000 మీటర్ల లోతుకు తీసుకెళ్లే నౌక నిర్మాణం

సముద్రయాన్ మిషన్‌లో భాగంగా సముద్రపు లోతులను అన్వేషించే మానవసహిత సబ్ మెర్సిబుల్ మత్స్య (హిందీ ఫర్ ఫిష్) 6000 వీడియో, ఫోటోలను సోమవారం కేంద్రమంత్రి కిరణ్ రిజిజు పంచుకున్నారు. ఈ నౌకను చెన్నైలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ (NIOT) అభివృద్ధి చేస్తోంది. ఇది భారతదేశపు మొట్టమొదటి మానవసహిత సముద్ర అన్వేషణ మిషన్ కానుంది. ఆక్వానాట్‌లను సముద్రంలో 6,000 మీటర్ల లోతుకు తీసుకెళ్లేందుకు గోళాకార నౌకను నిర్మిస్తున్నారు. అయితే, ఇది తొలుత 500 మీటర్ల మేర నీటి అడుగుకు ప్రయాణం చేయనుంది. ఈ మిషన్ సముద్ర పర్యావరణ వ్యవస్థకు భంగం కలిగించదని రిజిజు అన్నారు.

''తదుపరి సముద్రయాన్'. ఇది 'మత్స్య 6000' సబ్ మెర్సిబుల్, చెన్నైలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీలో నిర్మాణంలో ఉంది. భారతదేశపు మొట్టమొదటి మానవసహిత డీప్ ఓషన్ మిషన్ సముద్రయాన్. ముగ్గురు మనుషులను 6 కిలోమీటర్ల సముద్రపు లోతుకు వెళ్లవచ్చు. లోతైన సముద్ర వనరులు, జీవవైవిధ్యాన్ని అధ్యయనం చేయవచ్చు. ప్రాజెక్ట్ సముద్ర పర్యావరణ వ్యవస్థకు భంగం కలిగించదు' అని కేంద్రమంత్రి ఎక్స్ (ట్విట్టర్)లో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News