Peddireddi Ramachandra Reddy: చంద్రబాబు హెరిటేజ్ సంస్థ తెరిచే ఉంది!: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Peddireddy on Telugudesam Party AP bandh
  • చంద్రబాబు అవినీతి చేయలేదని టీడీపీ నేతలే చెప్పలేకపోతున్నారన్న పెద్దిరెడ్డి 
  • చంద్రబాబు ఇన్నాళ్లు స్టేలతో కాలం గడిపారని వ్యాఖ్య
  • స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేవలం ఆరంభమేనన్న పెద్దిరెడ్డి

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్ట్, రిమాండ్ నేపథ్యంలో నేడు (సోమవారం) ఏపీ బంద్‌కు ఆ పార్టీ పిలుపునిచ్చిందని, కానీ చంద్రబాబుకు చెందిన హెరిటేజ్‌నే మూయలేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... చంద్రబాబు అవినీతి చేయలేదని వారి పార్టీయే చెప్పలేకపోతోందన్నారు. కేవలం సాంకేతిక కారణాలను చూపించి అరెస్ట్ అక్రమమని చెబుతున్నారన్నారు. ఇన్నాళ్లు స్టేలతో కాలం గడిపిన టీడీపీ అధినేత విషయంలో ఇప్పుడు కూడా చట్టం తన పని తాను చేసుకుపోతోందన్నారు.

చంద్రబాబు అరెస్ట్‌పై ప్రజల నుంచి ఎలాంటి నిరసన కనిపించలేదన్నారు. టీడీపీ బంద్‌ను ప్రజలు ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. తాను రోడ్డు మీదుగా వస్తున్నప్పుడు అన్నీ తెరిచి ఉన్నాయని, హెరిటేజ్ కూడా నడుస్తోందన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేవలం ఆరంభమేనని, ఆయనపై చాలా కేసులు ఉన్నాయన్నారు. పూర్తి ఆధారాలతోనే సీఐడీ దర్యాఫ్తు చేస్తోందన్నారు. చంద్రబాబు దుర్మార్గపు వ్యవస్థ కూలిపోతోందన్నారు. పతనం అంటే ఏమిటో చంద్రబాబుకు ఇప్పుడు తెలుస్తోందన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, ఆ పార్టీ ఇతర నేతలు బెదిరింపు రాజకీయాలు చేస్తున్నారన్నారు. పశ్చాత్తాపం లేకుండా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.

  • Loading...

More Telugu News