CPI Ramakrishna: ధైర్యం కోల్పోవద్దు: నారా లోకేశ్ కు సీపీఐ రామకృష్ణ ఫోన్

CPI Ramakrishna telephones Nara Lokesh
  • చంద్రబాబు పట్ల సీబీఐ వ్యవహరించిన తీరు దుర్మార్గమన్న రామకృష్ణ 
  • మనోధైర్యాన్ని కోల్పోవద్దని లోకేశ్ కు ధైర్యం చెప్పిన వైనం
  • చంద్రబాబుకు సీపీఐ అండగా ఉంటుందని భరోసా
టీడీపీ అధినేత చంద్రబాబు రిమాండ్ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వంపై ఆ పార్టీ శ్రేణులతో పాటు విపక్ష పార్టీలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. రాష్ట్రానికి ఇదొక దుర్దినమని, చంద్రబాబు అరెస్ట్ అప్రజాస్వామికమని మండిపడుతున్నాయి. మరోవైపు టీడీపీ యువనేత నారా లోకేశ్ కు సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ ఫోన్ చేశారు. చంద్రబాబు పట్ల సీఐడీ వ్యవహరించిన తీరు దుర్మార్గమని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ధైర్యాన్ని కోల్పోవద్దని, మనోధైర్యంతో ఉండాలని ధైర్యం చెప్పారు. చంద్రబాబు విషయంలో సీపీఐ అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు. విపక్ష నేతలపై పోలీసులు దుందుడుకు వైఖరిపై విజయవాడలో రేపు అఖిలపక్షాలు, ప్రజా సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామని చెప్పారు.
CPI Ramakrishna
Nara Lokesh
Chandrababu
Telugudesam

More Telugu News