Pawan Kalyan: ధైర్యంగా ఉండాలంటూ నారా లోకేశ్ కు పవన్ కల్యాణ్ ఫోన్

Pawan Kalyan phone call to Nara Lokesh
  • టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్... రిమాండ్ కు తరలింపు
  • జగన్ నియంత పాలనపై పోరాడుదామని లోకేశ్ కు పవన్ పిలుపు
  • పవన్ కు కృతజ్ఞతలు తెలిపిన లోకేశ్
సైకో జగన్ నియంత పాలనపై కలిసి పోరాడుదామని జనసేనాని పనవ్ కల్యాణ్... టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు పిలుపునిచ్చారు. చంద్రబాబు అరెస్ట్, ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడం తదితర పరిణామాల నేపథ్యంలో పవన్ కల్యాణ్... నారా లోకేశ్ కు ఫోన్ చేశారు. ధైర్యంగా ఉండాలని సూచించారు. 

ప్రజల కోసం పోరాడుతున్న ప్రతిపక్ష నేతలని అక్రమ కేసుల్లో అరెస్ట్ చేయించి వేధించడం సైకో జగన్ కి అలవాటుగా మారిందని పవన్ విమర్శించారు. నియంతలా జగన్ సాగిస్తున్న అరాచకాలపై అంతా ఐక్యంగా పోరాడుదామని పవన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పవన్ కు నారా లోకేశ్ కృతజ్ఞతలు తెలిపారు.
Pawan Kalyan
Nara Lokesh
Chandrababu
Arrest
Remand
Janasena
TDP

More Telugu News