'ఆర్ఆర్ఆర్' చిత్రం నాకు బాగా నచ్చింది: బ్రెజిల్ దేశాధ్యక్షుడు లులా డసిల్వా
- భారత్ లో జీ20 శిఖరాగ్ర సమావేశాలు
- ఢిల్లీ విచ్చేసిన బ్రెజిల్ అధ్యక్షుడు
- ఓ ఇంటర్వ్యూలో ఆర్ఆర్ఆర్ సినిమా ప్రస్తావన
- చిత్ర బృందానికి అభినందనలు
మూడు గంటల నిడివి ఉన్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో అద్భుతమైన సన్నివేశాలు, అందమైన నృత్యాలు ఉన్నాయని లులా డసిల్వా వివరించారు. భారత్ పై బ్రిటీష్ ఆధిపత్యాన్ని తెలియజేస్తూ లోతైన విమర్శ చేయడాన్ని ఈ సినిమాలో అర్థవంతంగా చూపించారని కితాబిచ్చారు.
"ఈ సినిమా నిజంగా నన్ను చాలా ఆకట్టుకుంది. అందుకే, ఈ సినిమా చూసిన తర్వాత తెలిసిన వాళ్లందరినీ ఆర్ఆర్ఆర్ చిత్రం చూశారా అని అడిగాను. సినిమా చూస్తున్నంత సేపు చక్కగా ఆస్వాదించాను. ఆర్ఆర్ఆర్ దర్శకుడికి, నటీనటులకు అభినందనలు తెలియజేస్తున్నాను" అని వెల్లడించారు.