Chandrababu: చంద్రబాబు రిమాండ్ ను హౌస్ అరెస్ట్ గా మార్చాలన్న పిటిషన్ పై ముగిసిన వాదనలు

  • చంద్రబాబుకు సెప్టెంబరు 22 వరకు రిమాండ్
  • హౌస్ అరెస్ట్ పిటిషన్ వేసిన చంద్రబాబు న్యాయవాదులు
  • ఆరోగ్యం, వయసు, హోదా దృష్ట్యా హౌస్ అరెస్ట్ విధించాలన్న సిద్ధార్థ లూథ్రా
  • వ్యతిరేకించిన సీఐడీ తరఫు న్యాయవాది
  • కాసేపట్లో నిర్ణయం వెలువరించనున్న న్యాయస్థానం
Chandrababu advocates files petition seeking house arrest

తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నడూ లేనంత క్లిష్ట పరిస్థితిని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం ఎదుర్కొంటున్నారు. ఆయనకు స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కుంభకోణంలో విజయవాడ ఏసీబీ న్యాయస్థానం ఈ నెల 22 వరకు రిమాండ్ విధించింది. 

అయితే, రిమాండ్ ను హౌస్ అరెస్ట్ గా మార్చాలని చంద్రబాబు న్యాయవాదులు కోర్టును కోరారు. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి, వయసు, హోదాను దృష్టిలో ఉంచుకుని హౌస్ అరెస్ట్ విధించాలని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అయితే, ఈ హౌస్ అరెస్ట్ పిటిషన్ ను సీఐడీ తరఫు న్యాయవాది వ్యతిరేకించారు. ఈ అంశంపై వాదనలు ముగియగా, మరికాసేపట్లో న్యాయమూర్తి తన నిర్ణయం వెలువరించనున్నారు.

  • Loading...

More Telugu News