Kesineni Nani: తీర్పు మాకు అనుకూలంగానే వస్తుందని భావిస్తున్నాం: కేశినేని నాని

Kesineni Nani talks about court proceedings
  • కాసేపట్లో స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో ఏసీబీ కోర్టు తీర్పు
  • మీడియాతో మాట్లాడిన కేశినేని నాని
  • చంద్రబాబును ఇరికించడం కోసం ఈ కేసు అల్లారని ఆరోపణ

స్కిల్ డెవలప్ మెంట్  స్కాం కేసులో ఏసీబీ కోర్టు  తీర్పు పట్ల తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో అరెస్టయిన చంద్రబాబు కోర్టు హాల్లో తీర్పు కోసం ఎదురుచూస్తున్నారు. ఆయన వద్ద టీడీపీ ఎంపీ కేశినేని నాని, ఇతర నేతలు ఉన్నారు. కాసేపట్లో తీర్పు వెలువడనున్న నేపథ్యంలో కేశినేని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

తీర్పు తమకు అనుకూలంగానే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కేసులో పసలేదని, సీఐడీ వాదనలు నిలబడవని అన్నారు. ఇది చంద్రబాబును ఇరికించడం కోసం అల్లిన కేసు అని పేర్కొన్నారు. దేశంలో అవినీతి మచ్చలేని నాయకుడు చంద్రబాబు అని తెలిపారు. కోర్టులో  టీడీపీ న్యాయవాదులు బలంగా వాదనలు వినిపించారని వెల్లడించారు.

  • Loading...

More Telugu News