Virat Karna: 'పెదకాపు' నుంచి ట్రైలర్ రెడీ!

Pedakapu movie update
  • 'నారప్ప'తో హిట్ కొట్టిన శ్రీకాంత్ అడ్డాల 
  • తరువాత సినిమాగా వస్తున్న 'పెదకాపు'
  • సంగీతాన్ని సమకూర్చిన మిక్కీ జె మేయర్ 
  • ఈ నెల 29వ తేదీన సినిమా విడుదల  

శ్రీకాంత్ అడ్డాల సినిమా అనగానే ప్రేమకథలు వినిపిస్తాయి .. గ్రామీణ నేపథ్యంలోని ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుంది. పల్లెలోని ఆత్మీయతలను అందంగా ఆవిష్కరిస్తూ వచ్చిన శ్రీకాంత్ అడ్డాల, అదే పల్లెలోని రాజకీయాలను సహజంగా ఆవిష్కరించడానికి చేసిన ప్రయత్నమే 'పెదకాపు'. 

మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా, రెండు భాగాలుగా రూపొందింది. మొదటి భాగాన్ని ఈ నెల 29వ తేదీన విడుదల చేయనున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో, ప్రమోషన్స్ వేగాన్ని పెంచారు. అందులో భాగంగా రేపు ఉదయం 11:45 నిమిషాలకు ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. 

విరాట్ కర్ణ - ప్రగతి శ్రీవాత్సవ హీరో హీరోయిన్లుగా పరిచయమవుతున్నారు. రావు రమేశ్ కీలకమైన పాత్రను పోషించాడు. మిక్కీ జె మేయర్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని అంటున్నారు. 'నారప్ప' తరువాత శ్రీకాంత్ అడ్డాల నుంచి వస్తున్న ఈ సినిమా, ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందనేది చూడాలి.

  • Loading...

More Telugu News