Prabhas: మంచు విష్ణు కలల ప్రాజెక్టు ‘కన్నప్ప’లోకి ప్రభాస్​!

Prabhas to play key role in Manchu Vishnu kannappa movie
షార్ట్స్‌లో చూడండి
హిట్స్, ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసే టాలీవుడ్ హీరోల్లో మంచు విష్ణు ఒకరు. ‘భక్త కన్నప్ప’ తన కలల ప్రాజెక్టు అని చెబుతుండే విష్ణు ఈ మధ్య ‘కన్నప్ప’ అనే టైటిల్ తో ఆ చిత్రాన్ని ప్రారంభించారు. విష్ణు హీరోగా, నుపూర్ సనన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో మొదలైంది. మోహన్‌ బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం విదేశాల్లో షూటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. 

మంచు విష్ణు కలల ప్రాజెక్టులో రెబల్ స్టార్ ప్రభాస్ కీలక పాత్ర పోషిస్తాడన్న వార్త హల్ చల్ చేస్తోంది. ప్రముఖ విమర్శకుడు రమేష్ బాలా  ఈ విషయాన్ని ట్విట్టర్‌‌లో వెల్లడించారు. సినిమాలో ప్రభాస్ ఓ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారని విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసిందని పేర్కొన్నారు. ఈ ట్వీట్ కి మంచు విష్ణు బదులిస్తూ.. 'హరహర మహాదేవ్' అంటూ రీట్వీట్ చేశాడు. దాంతో, ప్రభాస్ నిజంగానే ఈ చిత్రంలో నటిస్తున్నాడా? నటిస్తే ఏ పాత్రలో కనిపిస్తాడు? అన్నది ఆసక్తి కలిగిస్తోంది.
.
Go Back to Shorts
Prabhas
Manchu Vishnu
kannappa
Mohan Babu
Tollywood

More Telugu News