Shahrukh Khan: కొనసాగుతున్న ‘జవాన్’ ప్రభంజనం.. మూడ్రోజుల్లో 350 కోట్ల వసూళ్లు

SRK Jawan film crosses Rs 350 crore globally
  • అట్లీ దర్శకత్వంలో వచ్చిన చిత్రం
  • గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదల
  • సూపర్ హిట్ టాక్‌ సొంతం
కొన్నేళ్ల పాటు వరుస ఫ్లాప్స్ తర్వాత ఈ ఏడాది ఆరంభంలో ‘పఠాన్’ చిత్రంతో బాలీవుడ్ కింగ్ షారుక్ ఖాన్ మళ్లీ విజయాల బాట పట్టాడు. ఈ సినిమా వెయ్యి కోట్లు కలెక్ట్ చేసి ఔరా అనిపించింది. ఇప్పుడు ‘జవాన్’ సినిమాతో కూడా షారుక్ అదే జోరు కొనసాగిస్తున్నాడు. ప్రముఖ తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కించిన ఈ చిత్రం కూడా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. రోజుకో వంద కోట్ల కలెక్షన్లతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. గురువారం విడుదలైన ఈ సినిమా మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 350 కోట్ల వసూళ్లు రాబట్టింది. 

తొలి రోజే రూ. 130 కోట్లు రాబట్టిన ఈ సినిమా రెండో రోజు 200 కోట్ల క్లబ్ లోకి చేరింది. మూడో రోజు వీకెండ్ శనివారం మరో 74 కోట్లు రాబట్టింది. హిందీ బెల్ట్ లో 62.85 శాతం ఆక్యుపెన్సీతో దూసుకెళ్తోంది. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా 350 కోట్ల కలెక్షన్లు రాబట్టిందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. వీటిలో భారత్‌లో హిందీ, తమిళ్, తెలుగులో కలిపి 202.73 కోట్లు వసూలు చేసిందని అంటున్నారు.
Shahrukh Khan
jawan
350cr
boxoffice

More Telugu News