Kokapet Neopolis: కోకాపేట భూములతోపాటు మా దేవుడినీ అమ్మేశారు.. స్థానికుల ఆందోళన

Villagers protest against govt who sells Kokapet Neopolis lands with shiv temple
  • కోకాపేటలోని నియోపోలిస్ భూములను వేలం వేసిన తెలంగాణ ప్రభుత్వం
  • వేలం వేసిన భూముల్లో ఆలయానికి చెందినవి కూడా ఉన్నాయన్న స్థానికులు
  • భూములు కొనుగోలు చేసిన సంస్థ చదును చేస్తుంటే ఆందోళన

కోకాపేటలో ఇటీవల తెలంగాణ ప్రభుత్వం వేలం వేసిన నియోపోలిస్ భూములతోపాటు తమ దేవుడిని కూడా అమ్మేశారంటూ గండిపేట మండలంలోని ఖానాపూర్ గ్రామస్థులు ఆందోళనకు దిగారు. గ్రామంలోని పురాతన శివాలయానికి సంబంధించిన గుట్టను కూడా భూముల వేలంలో విక్రయించారని ఆందోళన చేపట్టారు. ఆ వేలాన్ని ఆన్‌లైన్‌లో నిర్వహించడంతో తమకు తెలియలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

భూమిని వేలంలో కొనుగోలు చేసిన సంస్థ చదును చేస్తుంటేనే ఆ విషయం తమకు తెలిసిందన్నారు. శివుడి భూములను వేలం ఎలా వేస్తారని ప్రశ్నించారు. ఆలయ పరిరక్షణ కోసం తమ ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News