Morocco Earthquake: మొరాకో విలయం.. 2 వేలు దాటిన భూకంప మృతులు

Morocco earthquake laeves 2thousand dead
  • గాయపడిన వారిలో 1,404 మంది పరిస్థితి విషమం
  • ఆఫ్రికా ఖండం ఉత్తరభాగం చరిత్రలో ఇదే అతిపెద్ద భూకంపం
  • మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం

మొరాకో భూకంప విలయంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 2 వేలు దాటింది. మరో 2 వేల మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. ఇప్పటి వరకు 2,012 మంది ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు చెబుతున్నారు. గాయపడిన 2,059 మందిలో 1,404 మంది పరిస్థితి విషమంగా ఉందని, దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

ఆఫ్రికా ఖండం ఉత్తరభాగం చరిత్రలో ఇంత పెద్ద భూకంపం ఇదే తొలిసారని చెబుతున్నారు. తీర ప్రాంత నగరాలైన రబాత్, కాసాబ్లాంకా, ఎస్సౌయిరాలో బలమైన ప్రకంపనలు సంభవించినట్టు పేర్కొన్నారు. భూకంప కేంద్రం అల్‌హౌజ్ ప్రావిన్స్‌లోని ఇఘిల్ పట్టణ సమీపంలో, మర్రకేశ్‌కు దక్షిణాన దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో భూమిలో 18 కిలోమీటర్ల లోతున ఉన్నట్టు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది.

  • Loading...

More Telugu News