Puvvada Ajay Kumar: పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావు ఓ బుల్లెట్... అతడు ఉండడం మీ అదృష్టం: మంత్రి పువ్వాడ

Minister Puvvada describes Pinapaka MLA Rega Kantharao a bullet
  • పినపాక నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలతో మంత్రి పువ్వాడ సమావేశం
  • ఎమ్మెల్యే రేగ కాంతారావుపై ప్రశంసలు
  • అభివృద్ధి పనుల నిధుల కోసం నిత్యం తిరుగుతారని ప్రశంస 
  • రేగ కాంతారావును మళ్లీ గెలిపించుకోవాలని పిలుపు
తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పినపాక నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్యకార్యకర్తలతో సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావు ఓ బుల్లెట్ లాంటివాడని, అలాంటి చురుకైన వ్యక్తి ఎమ్మెల్యేగా ఉండడం పినపాక నియోజకవర్గ ప్రజల అదృష్టమని అన్నారు. 

అభివృద్ధి పనులకు నిధుల కోసం రేగ కాంతారావు పట్టువదలని విక్రమార్కుడిలా తిరుగుతాడని కొనియాడారు. రేగ కాంతారావు తనకు వ్యక్తిగతంగా తెలుసని, సచివాలయంలో ఆయనను చూస్తుంటానని వివరించారు. తన సమయాన్నంతా పినపాక నియోజకవర్గ అభివృద్ధి కోసమే కేటాయిస్తాడని ప్రశంసించారు. 

గోదావరి వరదలు వస్తే... గోదావరికి ఆ వైపు తాను, ఈవైపు రేగ కాంతారావు వరద సహాయచర్యల్లో పాలుపంచుకున్నామని పువ్వాడ వెల్లడించారు. రేగ కాంతారావు వంటి నేతలను మళ్లీ గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 

కష్టపడి పనిచేశామని తాము గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పగలమని, మీరేం చేశారంటూ విపక్షాలను నిలదీశారు. నమస్కారాలు పెడుతూ, తల నిమురుకుంటూ, మెడ వంకరగా పెట్టి కౌగిలించుకునే వాళ్లతో అభివృద్ధి జరుగుతుందా? అని ప్రశ్నించారు.
Puvvada Ajay Kumar
Rega Kantha Rao
Pinpaka
BRS
Telangana

More Telugu News