Rishi Sunak: బోట్ హెడ్ ఫోన్స్ తో కనిపించిన రిషి సునాక్... స్పందించిన బోట్ వ్యవస్థాపకుడు అమన్ గుప్తా

BoAT co founder Aman Gupta responds on Britain PM Rishi Sunak wearing boAT head phones
  • భారత్ లో జీ20 సదస్సు
  • ఢిల్లీ విచ్చేసిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్
  • భారత విద్యార్థులతో ముఖాముఖి
భారత్ ఆతిథ్యమిస్తున్న జీ20 సదస్సుకు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కూడా విచ్చేశారు. సునాక్ ఢిల్లీలో భారత విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన భారత్ లో తయారైన బోట్ హెడ్ ఫోన్స్ ధరించి కనిపించారు. దీనిపై బోట్ సహ వ్యవస్థాపకుడు, సంస్థ సీఎంవో అమన్ గుప్తా స్పందించారు. దీనికి సంబంధించిన ఫొటోను ఆయన ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్నారు. Bharat mein aapka boAt boAt Swaagat (బోట్ అనే పదాన్ని బహుత్ అనే అర్థం వచ్చేలా ఉపయోగించారు) అంటూ అమన్ గుప్తా క్యాప్షన్ పెట్టారు. ఇన్ స్టాలో ఈ పోస్టుకు విశేష స్పందన లభిస్తోంది.
Rishi Sunak
boAT Head Phones
Aman Gupta
G20
New Delhi
Bharat

More Telugu News