Vishnu Kumar Raju: చంద్రబాబుకు వస్తున్న ప్రజాదరణను ఓర్చుకోలేకపోతున్నారు.. వైసీపీకి 25 కంటే ఎక్కువ సీట్లు రావు: విష్ణుకుమార్ రాజు

YSRCP will not get more than 25 seats in next elections says Vishnu Kumar Raju
  • విచారణకు పిలవకుండానే నేరుగా అరెస్ట్ ఎలా చేస్తారన్న విష్ణురాజు
  • ప్రజల వద్దకు చంద్రబాబు వెళ్లకుండా అడ్డుకునే యత్నం చేస్తున్నారని విమర్శ
  • గతంలో పవన్ ను  కూడా అడ్డుకునే యత్నం చేశారని మండిపాటు
టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేయడంపై ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు. అర్ధరాత్రి పూట నోటీసులు ఇవ్వడం, అరెస్ట్ చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. విచారణకు పిలవకుండానే నేరుగా అరెస్ట్ ఎలా చేస్తారని విమర్శించారు. చంద్రబాబు సభలకు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్చుకోలేకే ఇలాంటి పనులకు పాల్పడుతున్నారని అన్నారు. ప్రజల వద్దకు చంద్రబాబు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

గతంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారని చెప్పారు. లోకేశ్ పాదయాత్రపై దాడులు చేశారని అన్నారు. తండ్రిని చూసేందుకు వెళ్తున్న లోకేశ్ ను అడ్డుకోవడం సరికాదన్నారు. వైసీపీపై ప్రజా వ్యతిరేకత పెరిగిపోయిందని... వచ్చే ఎన్నికల్లో 25 అసెంబ్లీ సీట్లు కూడా రావని జోస్యం చెప్పారు. 

Vishnu Kumar Raju
BJP
Chandrababu
Telugudesam
Nara Lokesh
Pawan Kalyan
Janasena

More Telugu News