Vijay Antony: రీ రిలీజ్ కి రెడీ అవుతున్న 'బిచ్చగాడు'

Bichhagadu Re release date confirmed
  • చాలా కాలం క్రితం వచ్చిన 'బిచ్చగాడు'
  • రికార్డు స్థాయిలో రాబట్టిన వసూళ్లు 
  • విజయ్ ఆంటోనిని నిలబెట్టిన సినిమా 
  • ఈ నెల 15వ తేదీన రీ రిలీజ్
టాలీవుడ్ నుంచి తెలుగులోకి చాలా సినిమాలు అనువాదమవుతూనే ఉంటాయి. ఏ మాత్రం కంటెంట్ ఉన్నప్పటికీ, తెలుగు సినిమాలతో సమానంగా తమిళ సినిమాలు కూడా ఇక్కడ ఆదరణ పొందుతూ ఉంటాయి. అలా తమిళంతో పాటు తెలుగులోను విజయవిహారం చేసిన సినిమాలలో ఒకటిగా 'బిచ్చగాడు' కనిపిస్తుంది. 

ఈ సినిమాకి ముందు విజయ్ ఆంటోని ఎవరనేది ఇక్కడివారికి పెద్దగా తెలియదు. ఈ సినిమా తరువాత ఆయన తెలియనివారు లేరు. అంతగా ఈ సినిమా ఇక్కడి ప్రేక్షకులపై ప్రభావాన్ని చూపించింది. అలాంటి ఈ సినిమాను ఇప్పుడు రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 'వినాయక చవితి' సందర్భంగా ఈ సినిమాను ఈ నెల 15వ తేదీన రిలీజ్ చేస్తున్నారు. 

టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. తెలుగు సినిమాలతో పాటు అనువాదాలుగా వచ్చిన తమిళ సినిమాలను కూడా విడుదల చేస్తున్నారు. అలా ఇటీవల 'రఘువరన్ బీటెక్' .. '7జి బృందావన కాలనీ' సినిమాలు విడుదలైన సంగతి తెలిసిందే. అదే బాటలో 'బిచ్చగాడు' కూడా అడుగులు వేస్తున్నాడన్న మాట. 
Vijay Antony
Sathna Titas
Sashi
Bichagadu

More Telugu News