Raghavendra Rao: ఏపీలోని అంబేద్కర్ విగ్రహాలన్నీ బాధపడుతున్నాయి: చంద్రబాబు అరెస్ట్‌పై దర్శకుడు రాఘవేంద్రరావు వ్యాఖ్య

  • రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అపహాస్యం అయిందని విమర్శ
  • బాబును అరెస్ట్ చేసిన విధానం అప్రజాస్వామికం అన్న దర్శకుడు
  • రాజ్యాంగం చచ్చిపోతున్నందుకు ఏపీలోని అంబేద్కర్ విగ్రహాలన్నీ 
    బాధ పడుతున్నాయంటూ ట్వీట్
Director Raghavendra Rao reacts strongly to Chandrababu arrest

టీడీపీ అధినేత ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టును సినీ, రాజకీయ ప్రముఖులు ఖండిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు ఈ విషయంపై తీవ్రంగా స్పందించారు. బాబును అరెస్ట్ చేసిన తీరు అప్రజాస్వామికంగా ఉందన్నారు.

‘ఆంధ్ర ప్రదేశ్ లో ప్రజాస్వామ్యం అపహాస్యం అయ్యింది. ఒక విజనరీ లీడర్ అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన విధానం అప్రజాస్వామికం. ఏపీలో ఉన్న అంబేద్కర్ విగ్రహాలన్నీ కూడా తాను రాసిన రాజ్యాంగం చచ్చిపోతున్నందుకు బాధ పడుతున్నాయి’ ట్వీట్ చేశారు. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఏపీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రమంతటా టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. చంద్రబాబును విజయవాడకు తరలిస్తున్న రోడ్లపై టీడీపీ శ్రేణులు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నాయి.

More Telugu News