Nara Lokesh: నా తండ్రిని చూసేందుకు వెళ్తుంటే రెస్ట్ తీసుకోమంటావా? నీకు జగన్ చెప్పాడా?: పోలీసధికారిపై లోకేశ్ ఫైర్

Nara Lokesh fires on Rajolu CI
  • తండ్రి అరెస్ట్ తో విజయవాడకు బయల్దేరిన లోకేశ్
  • లోకేశ్ ను అడ్డుకున్న రాజోలు సీఐ గోవిందరాజు
  • నా తండ్రిని చూసేందుకు కూడా నాకు అనుమతి కావాలా? అని మండిపడ్డ లోకేశ్
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తో టీడీపీ శ్రేణులు రగిలిపోతున్నాయి. తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు, తన తండ్రిని అరెస్ట్ చేసిన వెంటనే టీడీపీ యువనేత నారా లోకేశ్ తన పాదయాత్ర క్యాంప్ సైట్ నుంచి విజయవాడకు బయల్దేరారు. అయితే రాజోలు సీఐ గోవిందరాజు లోకేశ్ ను అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో లోకేశ్ రోడ్డుపైనే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఐతో ఆయన వాగ్వాదానికి దిగారు. 

నా తండ్రిని చూడ్డానికి కూడా నాకు అనుమతి కావాలా? అని లోకేశ్ ఫైర్ అయ్యారు. నోటీస్ లేకుండా తనను ఎలా అడ్డుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భర్తను చూసేందుకు వచ్చే తన తల్లిని, మామను చూసేందుకు వచ్చే తన భార్యను అడ్డుకోగలరా? అని ప్రశ్నించారు. రెస్ట్ తీసుకోవాలని చెప్పిన సీఐపై ఆయన మండిపడ్డారు. తండ్రిని చూసేందుకు వెళ్తుంటే రెస్ట్ తీసుకోమంటావా? నీకు సైకో జగన్ చెప్పాడా? అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

మరోవైపు, లోకేశ్ కు మద్దతుగా అక్కడ పెద్ద సంఖ్యలో టీడీపీ నేతలు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు. తండ్రిని చూసేందుకు కొడుక్కి పోలీసుల అనుమతి కావాలా? అనే ప్లకార్డును ఒక చేతిలో పట్టుకుని, జాతీయ జెండాను మరో చేతిలో పట్టుకుని లోకేశ్ నిరసన వ్యక్తం చేశారు.
Nara Lokesh
Chandrababu
Telugudesam
Arrest

More Telugu News