Air Hostess: ఎయిర్‌హోస్టెస్‌ను ముద్దాడబోయి జైలుపాలైన బంగ్లాదేశ్ యువకుడు

Bangladeshi National Arrested For Sexually Harassing Vistara Air Hostess
  • మస్కట్ నుంచి ఢాకా బయలుదేరిన విమానం
  • ఎయిర్‌హోస్టెస్‌ను కౌగిలించుకుని ముద్దాడబోయిన ప్రయాణికుడు
  • వారించిన తోటి ప్రయాణికులతో అసభ్య ప్రవర్తన
  • వికృత ప్రయాణికుడిగా ప్రకటించిన కెప్టెన్
  • ముంబైలో ల్యాండ్  కాగానే అరెస్ట్

ఎయిర్‌హోస్టెస్‌ను ముద్దాడబోయిన ఓ బంగ్లాదేశ్ ప్రయాణికుడు ఇప్పుడు తీరిగ్గా కటకటాలు లెక్కించుకుంటున్నాడు. విస్తారా విమానం ఈ నెల 6న మస్కట్ నుంచి ఢాకాకు బయలుదేరింది. గురువారం విమానం మరికాసేపట్లో ముంబైలో ల్యాండ్ అవుతుందనగా బంగ్లాదేశ్‌కు చెందిన మహమ్మద్ దులాల్ (30) ఎయిర్‌హోస్టెస్‌ను కౌగిలించుకుని ముద్దు పెట్టుకునేందుకు ప్రయత్నించాడు. 

అప్రమత్తమైన విమాన సిబ్బంది, తోటి ప్రయాణికులు అతడిని మందలించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఏమాత్రం వెనక్కి తగ్గకపోగా వారితోనూ అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో కెప్టెన్ జోక్యం చేసుకుని రెడ్ వార్నింగ్ కార్డ్ చదివి అతడిని వికృత ప్రయాణికుడిగా ప్రకటించాడు. ఆ తర్వాత విమానం ముంబైలో ల్యాండ్ అయిన వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. న్యాయమూర్తి అతడిని పోస్ట్ కస్టడీకి ఆదేశించారు.

  • Loading...

More Telugu News