uno: ఇండియా పేరు భారత్‌గా మారిస్తే లాంఛనాలు పూర్తి చేస్తాం!: ఐక్యరాజ్యసమితి

  • దేశం పేరు మార్పుపై ఇక్కడ జరుగుతోన్న ప్రచారంపై ఐరాస వ్యాఖ్యానించబోదన్న ప్రతినిధి
  • భారత్ భద్రతా మండలిలో చేరే అంశంపై స్పందించిన ఐరాస చీఫ్
  • ఈ విషయం తమ చేతుల్లో లేదన్న గుటెరస్
One Earth One Family Timeless Ideal Inspired By Maha Upanishad

ఇండియా పేరును భారత్‌గా మార్చనున్నారనే అంశంపై ఐక్యరాజ్యసమితి తాజాగా మరోసారి స్పందించింది. జీ20 సదస్సులో పాల్గొనేందుకు ఢిల్లీకి వచ్చిన ఐరాస బృందంలోని సెక్రటరీ జనరల్ ముఖ్య అధికార ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ విలేకరులతో మాట్లాడుతూ... పేరు మార్పుకు సంబంధించిన లాంఛనాలు పూర్తిచేస్తే ఐక్యరాజ్యసమితి రికార్డుల్లో వాటిని మార్చుతామన్నారు. దేశం పేరు మార్పుపై ఇక్కడ జరుగుతోన్న చర్చ మీద ఐరాస వ్యాఖ్యానించబోదన్నారు. ఇందుకు సంబంధించి లాంఛనాలు పూర్తయితే మాత్రం ఐరాస పేరు మార్చుతుందన్నారు.

మరోవైపు, భద్రతా మండలిలో భారత్ చేరే అంశంపై ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియా గుటెరస్ స్పందించారు. భద్రతా మండలిలో చేరేందుకు భారత్‌కు సమయం ఆసన్నమైందా? అని విలేకరులు అడిగారు. దీనిపై గుటేరస్ మాట్లాడుతూ... ఈ విషయం తమ చేతుల్లో లేదని, సభ్య దేశాలు తుది నిర్ణయం తీసుకుంటాయని చెప్పారు. భద్రతా మండలిలో ఎవరు ఉండాలనే నిర్ణయం తమది కాదన్నారు. నేటి ప్రపంచంలో బహుపాక్షిక వ్యవస్థను ప్రతిబింబించేలా సంస్కరణలు అవసరమని విశ్వసిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా భారత్‌ను విశ్వదేశంగా పేర్కొన్నారు.

More Telugu News