Gudivada Amarnath: చంద్రబాబును ఎందుకు అరెస్ట్ చేయకూడదు?: మంత్రి గుడివాడ అమర్నాథ్

Minister Amarnath questions chandrababu should arrested
  • చంద్రబాబు దొంగ పనులు చేశారంటూ ఆరోపణలు
  • ఎలాంటి తప్పు చేయకుంటే వారిని దేశం ఎందుకు దాటించారని ప్రశ్న
  • బాబుకు సహకరించిన దొంగలు ఎక్కడ దాక్కున్నా లాక్కొస్తామని వ్యాఖ్య
  • పురందేశ్వరి, పవన్ కల్యాణ్ ఎందుకు స్పందించడం లేదని నిలదీత
దొంగ పనులు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబును ఎందుకు అరెస్ట్ చేయకూడదని మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... చట్టం ముందు అందరూ సమానులే అన్నారు. అందుకే రాజధాని పేరుతో రూ.118 కోట్లు తీసుకున్న చంద్రబాబుకు ఐటీ నోటీసులు జారీ అయ్యాయన్నారు. ఎలాంటి తప్పు చేయకుంటే పార్థసాని, శ్రీనివాస్‌లను దేశం ఎందుకు దాటించారో చెప్పాలన్నారు.

చంద్రబాబుకు సహకరించిన దొంగలు ఎక్కడ దాక్కున్నా లాక్కొస్తామన్నారు. తనను అరెస్ట్ చేస్తారని చెబుతూ చంద్రబాబు సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు జారీ అయిన ఐటీ నోటీసులపై బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎందుకు స్పందించడం లేదో చెప్పాలన్నారు.
Gudivada Amarnath
Chandrababu
Andhra Pradesh

More Telugu News