vasantha nageswara rao: కేశినేని నానిని మరోసారి గెలిపించాలి: వసంత నాగేశ్వరరావు

vasantha nageswara rao praises MP Kesineni Nani
  • కేశినేని అభివృద్ధి పనులు చేశారన్న వసంత నాగేశ్వరరావు
  • మరోసారి గెలిపిస్తే మిగతా పనులు చేస్తారన్న మాజీ మంత్రి
  • గతంలో కేఎల్ రావు ఎలా పని చేశారో అలా చేస్తున్నారని కితాబు

విజయవాడ ఎంపీగా కేశినేని నాని మరోసారి గెలవాలని మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ... ఎంపీగా కేశినేని చాలా బాగా పనులు చేశారని కితాబునిచ్చారు. మరోసారి గెలిస్తే మిగతా పనులు కూడా పూర్తి చేస్తారన్నారు. అందుకే ఆయనను మరోసారి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తాను చాలామంది ఎంపీలను చూశానని, కానీ రెండు రోజుల్లోనే బ్రిడ్జిని శాంక్షన్ చేయించిన వ్యక్తి కేశినేని అన్నారు.

ఆయన పనితీరును ప్రజలంతా చూశారన్నారు. నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశారన్నారు. గతంలో కేఎల్ రావు ఎలా పని చేశారో, ఇప్పుడు ఈయన అలాగే పని చేస్తున్నారన్నారు. తన యాభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి ఎంపీని చూడలేదన్నారు. కాగా, కేశినేని నాని వచ్చే ఎన్నికల్లోను టీడీపీ నుండి ఎంపీగా పోటీ చేస్తానని ఈ రోజు స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News