Jawan movie: జవాన్ సినిమాపై మహేశ్ బాబు రివ్యూ

Mahesh Babu reviews Jawan SRK is on fire stuff of the legends
  • కింగ్ నుంచి కింగ్ సైజు స్టఫ్ అంటూ కామెంట్
  • షారూక్ కెరీర్ లోనే ఉత్తమ చిత్రం అవుతుందన్న మహేశ్
  • సొంత రికార్డులనే బద్దలు చేస్తుందన్న అభిప్రాయం
  బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టిస్తున్న షారూక్ ఖాన్ 'జవాన్' సినిమాపై ప్రముఖ తెలుగు నటుడు మహేశ్ బాబు తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. మహేశ్ బాబు తాజాగా జవాన్ సినిమాను చూశారు. దీనిపై ఆయన ట్విట్టర్ లో (ఎక్స్) ఒక పోస్ట్ పెట్టారు. జవాన్ ను బ్లాక్ బస్టర్ మూవీగా పేర్కొన్నారు. జవాన్ సినిమా ఈ నెల 7న విడుదల కాగా, మొదటి రోజే రూ.150 కోట్లు వసూలు చేసి రికార్డులు నమోదు చేయడం గమనార్హం. 

‘‘జవాన్.. బ్లాక్ బస్టర్ సినిమా.. కింగ్ నుంచి కింగ్ సైజు వినోదం. షారూక్ కెరీర్ లోనే ఉత్తమ చిత్రం.. ప్రకాశం, తేజస్సు, స్క్రీన్ పై కనిపించిన తీరు ఎంతో ప్రత్యేకం. జవాన్ షారూక్ సొంత రికార్డులనే బ్రేక్ చేస్తుంది. ఎంతో కూల్.. దిగ్గజాల నుంచి స్టఫ్’’ అంటూ మహేశ్ బాబు తన అభిప్రాయాలను పంచుకున్నారు. అట్లీ కుమార్ దర్శకత్వంలో వచ్చిన జవాన్ యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో ఉంటుంది. ఈ సినిమాలో షారూక్ రెండు పాత్రలను పోషించారు. నయనతార, దీపికా పదుకొణె, ప్రియమణి తదితరులు ఈ సినిమాలో నటించారు.
Jawan movie
Mahesh Babu
review
SRK
boxoffice
records

More Telugu News