Bollywood: అక్షయ్ కుమార్ ‘మిషన్ రాణిగంజ్’ టీజర్ వచ్చేసింది

Mission Raniganj The Great Bharat Rescue Official Teaser
  • 1989 నవంబర్ 13న రాణిగంజ్ అనే మైనింగ్ ఏరియాలో ప్రమాదం ఆధారంగా చిత్రం
  •  మైనింగ్ ఇంజనీర్ పాత్రలో నటించిన అక్షయ్ 
  • హీరోయిన్ గా పరిణీతి చోప్రా
వరుస విజయాల తర్వాత కొన్నాళ్లు వైఫల్యాల్లో ఉన్న బాలీవుడ్ అగ్ర నటుడు అక్షయ్ కుమార్ ఈ మధ్య ఓ మై గాడ్ చిత్రంతో మళ్లీ గాడిలో పడ్డారు. ప్రస్తుతం ఆయ‌న ప్ర‌ధాన పాత్రలో న‌టిస్తున్న తాజా చిత్రం మిషన్ రాణిగంజ్. ది గ్రేట్ భారత్ రెస్క్యూ అనేది ఉప శీర్షిక. పరిణీతి చోప్రా కథానాయికగా నటిస్తోంది. బ్లాక్ బస్టర్ చిత్రం కేసరి తర్వాత అక్షయ్, పరిణీతి మళ్లీ జంటగా నటిస్తుండటంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. టిను సురేష్ దేశాయ్ దర్శకత్వం వ‌హిస్తున్న ఈ సినిమా టీజర్ తాజాగా విడుదలైంది. 


1989 నవంబర్ 13న రాణిగంజ్ అనే మైనింగ్ ఏరియాలో జరిగిన ప్రమాదం బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కింది. ఈ ప్రమాదంలో జస్వంత్ సింగ్ గిల్ అనే మైనింగ్ ఇంజనీర్ బొగ్గు గనుల్లో చిక్కుకున్న 64 మందిని కార్మికులను కాపాడారు. ఆయన పాత్రలో అక్షయ్ కుమార్ క‌నిపించారు. టీజర్ లో ఈ విషయాన్ని ఆసక్తికరంగా చూపెట్టారు. ఈ సినిమా అక్టోబర్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తికాగా.. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ పనులు జరుగుతున్నాయి.
Bollywood
akshay kumar
parineeti chopra
Mission Ranigan
teaser

More Telugu News