Kadapa TDP: కడప, ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్చార్జీలను నియమించిన టీడీపీ

TDP appoints incharges to Kadapa and Prathipadu assembly constituencies
  • కడప అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జీగా మాధవీరెడ్డి
  • ప్రత్తిపాడు ఇన్చార్జీగా రిటైర్డ్ ఐఏఏస్ అధికారి రామాంజనేయులు
  • ఉత్తర్వులు జారీ చేసిన పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు
రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జీలను నియమించింది. కడప అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జీగా మాధవీరెడ్డి, గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్చార్జీగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బి.రామాంజనేయులును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశానుసారం ఈ రెండు నియోజకవర్గాలకు ఇన్చార్జీలను నియమించారు. టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేరిట ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
Kadapa TDP
Prathipadu
Telugudesam
Incharge

More Telugu News