Wagh Nakh: ఛత్రపతి శివాజీ వాడిన ఆయుధం.. త్వరలో భారత్‌కు..!

Wagh nakh that shivaji used to kill afzhal khan to come home to india
  • వాఘ్‌ నాఖ్‌తో బీజాపూర్ సైన్యాధిపతిని 17వ శతాబ్దంలో అంతమొందించిన మరాఠా సామ్రాట్
  • చాలా కాలంగా బ్రిటన్ మ్యూజియంలో వాఘ్‌నాఖ్ ప్రదర్శన
  • ఆయుధాన్ని తిరిగిచ్చేందుకు బ్రిటన్ అధికారుల అంగీకారం
  • అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ ఏడాదే ఆయుధం భారత్‌కు చేరుతుందన్న మహారాష్ట్ర మంత్రి
1659 లో బీజాపూర్ సైన్యాధిపతి అఫ్జల్ ఖాన్‌ను అంతమొందించేందుకు మరాఠా సామ్రాట్ ఛత్రపతి శివాజీ ఉపయోగించిన ఆయుధం ‘వాఘ్‌ నాఖ్’ త్వరలో భారత్‌కు తిరిగిరానుంది. పులి గోళ్ల లాగా కనిపించినే ఈ ఆయుధాన్ని ఇనుముతో తయారు చేశారు.  దీన్ని భారత్‌కు తిరిగి ఇచ్చేందుకు బ్రిటన్ ప్రభుత్వం అంగీకరించిందని మహారాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి సుధీర్ ముంగతివార్ తాజాగా పేర్కొన్నారు. ప్రస్తుతం విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియంలో ఉన్న ఈ ఆయుధాన్ని వెనక్కు తెచ్చేందుకు మంత్రి ఈ నెలలో బ్రిటన్‌కు వెళ్లి మ్యూజియం వారితో అవగాహన ఒప్పందం కుదుర్చుకోనున్నారు. 

‘‘ఆ ఆయుధాన్ని తిరిగిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని బ్రిటన్ అధికారుల నుంచి మాకు లేఖ అందింది. ఈ ఏడాదిలోనే అది మనకు చేరవచ్చు’’ అని మంత్రి పేర్కొన్నారు. అఫ్జల్ ఖాన్‌ను శివాజీ అంతమొందించిన రోజున దీన్ని భారత్‌కు తేవాలని యోచిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇందుకోసం ఇతర ముఖ్య తేదీలను కూడా పరిశీలిస్తున్నట్టు తెలిపారు.
Wagh Nakh
Shivaji
UK
Maharashtra

More Telugu News