Rahul Gandhi: రాహుల్ గాంధీ పాదయాత్ర దేశాన్ని ఐక్యం చేసింది: రేవంత్ రెడ్డి

Revanth Reddy says Rahul Gandhi Bharat Jodo Yatra made country united
  • రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు ఏడాది పూర్తి
  • రాహుల్ కు శుభాకాంక్షలు తెలిపిన రేవంత్ రెడ్డి
  • రాహుల్ వేసిన అడుగు భిన్నత్వంలో ఏకత్వాన్ని పటిష్ఠం చేసిందని వెల్లడి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర దేశాన్ని ఐక్యం చేసిందని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తన పాదయాత్ర ద్వారా రాహుల్ పేదలకు భరోసా ఇచ్చారని తెలిపారు. భారత్ జోడో యాత్రకు ఏడాది పూర్తయిన సందర్భంగా రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ లో స్పందించారు.

 "అతని అడుగు దేశాన్ని ఏకం చేసింది. భిన్నత్వంలో ఏకత్వాన్ని మరింత పటిష్ఠం చేసింది. మధ్యతరగతి ప్రజలకు నమ్మకాన్ని ఇచ్చింది. సాటి మనిషికి ప్రేమను పంచింది. ప్రత్యర్థికి సవాల్ విసిరింది. దోపిడీని ప్రశ్నించింది" అంటూ రేవంత్ తన పోస్టులో అభివర్ణించారు. 

145  రోజుల పాటు సాగిన భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ 12 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో నడిచారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 4,081 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు.
Rahul Gandhi
Bharat Jodo
Revanth Reddy
Congress
Telangana

More Telugu News