చంద్రబాబు పాలవ్యాపారం ఎందుకు చేస్తున్నాడంటే...: కొడాలి నాని
- చంద్రబాబును అరెస్ట్ చేయకుంటే ముద్దు పెట్టుకుంటారా? అన్న నాని
- ఐటీ నోటీసులపై ఆయన నోరు విప్పాలని డిమాండ్
- పాలు, పిడకలు అమ్మి దేశంలో ఎవరూ ఇంతలా సంపాదించలేదని వ్యాఖ్య
మనం ఏదైనా మంచి పని చేసి ఉంటే అది ప్రజలు చెప్పాలన్నారు. కానీ చంద్రబాబు మాత్రం సెల్ఫీలు తీసుకొని గొప్పలు చెప్పుకోవడమేమిటని మండిపడ్డారు. హైదరాబాద్‌ను తానే కట్టానని చంద్రబాబు చెబుతారని, కానీ అక్కడ పోటీ చేస్తే డిపాజిట్ కూడా రాదన్నారు. పిట్టల దొరలు లేని లోటును ఆయన తీరుస్తున్నారన్నారు. రాష్ట్రంలో కేవలం ఐదుగురు వ్యక్తులు మాత్రమే సంపదని దోచుకోవాలని కుట్రలు చేస్తున్నారన్నారు.