అమెరికాలో ఫుట్‌బాల్ ఆడిన బండి సంజయ్.. వీడియో ఇదిగో!
- 10 రోజుల పర్యటన కోసం అమెరికా వెళ్లిన సంజయ్
- పలు సమావేశాల్లో పాల్గొంటున్న బీజేపీ నేత
- ఈ నెల 10న స్వదేశానికి తిరిగి రాక
అమెరికా వెళ్లినప్పటి నుంచి బిజీబిజీగా ఉన్న బండి సంజయ్ కాసేపు సేద తీరారు. ఓ చిన్న పిల్లాడితో సరదాగా ఫుట్ బాల్ ఆడారు. మైదానంలో తన ఫుట్ బాల్ నైపుణ్యాలు చూపెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోను సంజయ్ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ (ట్విట్టర్)లో షేర్ చేశారు. కాగా, ఈ నెల 10న సంజయ్ తన పర్యటనను పూర్తి చేసుకొని స్వదేశానికి తిరిగి రానున్నారు.