West Bengal: మేక కోసం రైలు టిక్కెట్టు కొన్న మహిళ.. వీడియో ఇదిగో!

West bengal woman bought rail ticket for goat video goes viral
  • పశ్చిమ బెంగాల్‌లో వెలుగు చూసిన ఘటన 
  • మేకతో పాటూ రైలెక్కిన మహిళ
  • చెకింగ్‌కు వచ్చిన టీటీఈకి మేక కోసం కొన్న టిక్కెట్టు గర్వంగా చూపించిన వైనం
  • నెట్టింట వీడియో వైరల్, మహిళపై ప్రశంసల వర్షం

మేకకు కూడా రైలు టిక్కెట్టు కొని తన నిజాయతీ చాటుకున్న ఓ గ్రామీణ మహిళ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. పశ్చిమ బెంగాల్‌లో ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. అవనీశ్ శరణ్‌ అనే ప్రభుత్వాధికారి ఈ వీడియోను ‘ఎక్స్’ సోషల్ మీడియా వేదికలో షేర్ చేశారు. 

టికెట్టు చెకింగ్ కోసం వచ్చిన టీటీఈ మహిళను చూసి టిక్కెట్ ఉందా? అని అడిగారు. ఆమె పక్కనే ఉన్న మరో వ్యక్తి టీటీఈకి టిక్కెట్టు చూపించాడు. ఆ తరువాత మహిళ పక్కన ఓ మేక ఉండటం చూసిన ఆయన మేక కోసం టిక్కెట్టు కొన్నారా? అని అడిగారు. దీనికి అవునని నవ్వుతూ సమాధానమిచ్చిన మహిళ టిక్కెట్టు కూడా చూపించింది. 

ఈ సంవాదం నెట్టింట వైరల్‌గా మారింది. మేకకు కూడా టిక్కెట్టు కొని తన నిజాయతీని సగర్వంగా ప్రకటించుకుందని అనేక మంది వ్యాఖ్యానించారు. ఆమె నిజాయతీని వేనోళ్ల ప్రశంసించారు. కట్టుదాటితే గానీ గిట్టుబాటుకాదనే వారున్న రోజుల్లో ఇలాంటి వాళ్లు ఉండటం గొప్ప విషయమేనని కొందరు కామెంట్ చేశారు.

  • Loading...

More Telugu News